: రైతన్నలను ఆదుకోకుంటే బాబు పాదయాత్రలోనే మహాధర్నా: కోడెల
అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతన్నలను పట్టించుకోకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రలోనే మహాధర్నా చేపడతారని ఆయన హెచ్చరించారు.
ఓ వైపు ప్రభుత్వం పట్టించుకోక ఇబ్బంది పడుతున్న రైతన్నలపై ప్రకృతి కూడా కన్నెర్ర చేసిందని కోడెల అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సహకార ఎన్నికల్లో గెలుపు కోసం తపన ఉందే తప్ప, రైతులను ఆదుకోవడంపై శ్రద్ధ లేదని కోడెల విమర్శించారు.