: రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు
కాంగ్రెస్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ హయాంలో అభివృద్ధి కోసం చెట్లను నాటితే, వాటి ఫలాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవిస్తోందని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
గుంటూరు జిల్లా తెనాలి మండలం చినరావూరులో 'వస్తున్నా-మీ కోసం' పాదయాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో సాగునీరు లేక ఓ వైపు, అకాల వర్షాలతో మరో వైపు రైతులు ఇక్కట్లు పడుతున్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు.