: నటసార్వభౌముడికి 'నాణెం'తో నీరాజనం


విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు... బహుశా ఆయన్ను పరిచయం చేయడానికి ముందుగా ఈ పదాలను కచ్చితంగా వాడాల్సిందేనేమో... ఎందుకంటే, ఆయన నిజంగానే విశ్వవిఖ్యాతుడు... దేవుడి రూపం ఎలా ఉంటుందో మనకు కచ్చితంగా తెలియదు. కానీ ఆయన వేసిన ఏ దేవుడి వేషమైనా చూసిన వారికి బహుశా దేవుడు ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది. అంతటి రూపసి ఎన్టీఆర్‌. ఆయన గౌరవార్ధం నాణెం విడుదల చేయనున్నారు.

భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగాను, ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి విరాళాల సేకరణ నిమిత్తం ఎన్టీఆర్‌పై నాణెం విడుదల చేయనున్నట్టు నాణేన్ని రూపొందించిన గోల్డెన్‌ లైన్‌ సంస్థ ప్రతినిధులు నాగేశ్వర్‌రావు, రామిరెడ్డిలు చెబుతున్నారు. ఈ నాణేనికి ఒకవైపు ఎన్టీఆర్‌ చిత్రం, మరోవైపు ఆసుపత్రి చిహ్నాలు ఉంటాయని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News