: సత్తా చాటిన పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్'!


పవన్ కల్యాణ్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' మాటీవీ అవార్డులను కొల్లగొట్టింది. పవన్-హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ బాక్సాఫీస్ ప్రభంజనం మొత్తం 6 అవార్డులను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో 'గబ్బర్ సింగ్' హల్ చల్ సృష్టించింది. ఉత్తమ నటుడిగా పవన్ కల్యాణ్, ఉత్తమ దర్శకుడిగా హరీశ్ శంకర్, ఉత్తమ నిర్మాతగా బండ్ల గణేశ్, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా గణేశ్, ఉత్తమ ఎడిటర్ గా గౌతమ్ రాజు, ఉత్తమ కమెడియన్లుగా అంత్యాక్షరి టీమ్ అవార్డులు దక్కించుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News