: రెచ్చిపోతున్న మోడీ ప్రత్యర్థులు


తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రత్యర్థులు తమ అస్త్రాలకు పదునుపెడుతున్నారు. మోడీని ప్రధానమంత్రిగా దేశ ప్రజలు ఎన్నడూ అంగీకరించరని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. మోడీ వైఖరిపై దేశవాసులకు అనుమానాలున్నాయంటూ, ఆయన ప్రతిష్ఠ నీటి బుడగలాంటిదని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకల్లో ఏం జరిగిందో బీజేపీకి తెలియంది కాదని, ప్రజలేమీ అమాయకులు కాదని గెహ్లాట్ అన్నారు. బీహార్లో బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News