: అగస్టా కుంభకోణంపై బీజేపీ గరంగరం
అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణాన్ని తేలిగ్గా తీసుకోబోమని బీజేపీ అంటోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు సరిపోదని, సిట్ తో విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు.
పార్లమెంటు సమావేశాల తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు రైతుల కష్టాలు తీర్చేందుకు రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని వెంకయ్య అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడపాలని ఆయన సూచించారు.