: తీపి ఎక్కువగా తినే వారికి చేదు వార్త!
అవగాహన లేకపోవడం వల్ల కావొచ్చు గానీ.. చక్కెర ఎక్కువగా తింటే చక్కెర వ్యాధి వస్తుందనుకుంటారు కొందరు. నిజానికి చక్కెరకు చక్కెర వ్యాధికి సంబంధం లేదు. కానీ అంతకంటె ప్రమాదకరమైన విషయం ఏం బయటపడిందంటే.. చక్కెరకు గుండెజబ్బుకు సంబంధం ఉందండోయ్. ఆహారంలో చక్కెరను ఎక్కువగా వినియోగించే అలవాటు ఉన్నవారు.. గుండెజబ్బుల బారిన పడే అవకాశం మెండుగా ఉంటుందంటున్నారు, అమెరికా పరిశోధకులు. అతిగా చక్కెర లేదా పిండిపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ 6-ఫాస్పేట్ (జీ6పీ) అనే మూలకం పేరుకుంటుందిట.
ఇది గుండెపై ఒత్తిడిపెంచి హృదయంనుంచి రక్తప్రసరణ వేగాన్ని కూడా తగ్గిస్తుందిట. ఇది ముదిరితే గుండె ఆగడానికి కూడా కారకం కాగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. టెక్సాస్ వర్సిటీకి చెందిన హిస్రిచ్ టేగ్మియర్ ఈ విషయంలో పరిశోధనలు నిర్వహించారు. బీపీ, షుగర్ ఉన్న వారికి ఈ చక్కెర అతిగా తినడం తోడైతే.. గుండెజబ్బు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని కూడా అంటున్నారు.