: దాయాదుల పోరులో ఓవర్ల కోత
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు పలుమార్లు వర్షం అడ్డంకిగా నిలవడంతో ఓవర్లను తగ్గించారు. మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. బర్మింగ్ హామ్ లో జరుగుతోన్న ఈ పోరులో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన పాక్ 25 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. క్రీజులో అసద్ షఫీక్ (25 బ్యాటింగ్), మిస్బావుల్ హక్ (20 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ 2, అశ్వన్ ఓ వికెట్ తీశారు.