: పాకిస్తాన్ లో పేలిన బస్సు బాంబు


పాకిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ఈ మారు ఓ యూనివర్శిటీ బస్సులో బాంబు పెట్టిన టెర్రరిస్టులు విధ్వంసం సృష్టించారు. క్వెట్టాలోని మహిళా విశ్వవిద్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు ధాటికి 11 మంది విద్యార్థినులు మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడుకు ఐఈడీ (అత్యాధునిక పేలుడు పదార్థం) ఉపయోగించినట్టు తెలుస్తోంది. విద్యార్థినులు క్లాసులు ముగిసిన వెంటనే నివాసాలకు వెళ్ళే క్రమంలో ఈ విషాదం చోటు చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. పేలుడు అనంతరం బస్సు మంటల్లో చిక్కుకోవడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయని ఫయాజ్ సుంబాల్ అనే పోలీసు అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News