: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో వానలు


రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం శనివారం ప్రకటించింది. అగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వివరించింది. చత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కదులుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా, తెలంగాణల్లో పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, సముద్రంలో వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News