: కేసీఆర్ తెలంగాణ ద్రోహే: దిలీప్ కుమార్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను తెలంగాణ ద్రోహి అంటూ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ పరోక్షంగా దెప్పిపొడిచారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనని వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చలో అసెంబ్లీకి హాజరు కాకుండా ఫాంహౌస్లో ఉన్నారని దిలీప్ ఆరోపించారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులను టీజేఏసీ నిర్ణయించాలని ఆయన అన్నారు.