: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. ఈ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,12,897 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 977 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 150 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఈ పరీక్షల కోసం పనిచేస్తున్నారు.