: కారు పార్కింగ్ కు 3.28 కోట్లు


మీకే ఓ కారుంది.. కారు ఖరీదైనదే కానీ దాన్ని పెట్టుకోడానికి మీ దగ్గర స్థలంలేదు. అప్పుడేం చేస్తారూ? మహా అయితే తక్కువ ధరకు పార్కింగ్ కు స్థలం దొరికితే కొంటారు. లేదు మరీ ఇబ్బందిగా ఉంటే కారే అమ్మేస్తారు. కానీ బోస్టన్ కు చెందిన లీసా బ్లూమెంతల్ అనే మహిళ తన కారు పార్కింగ్ కోసం ఏకంగా 3,27,44,920 రూపాయలను వెచ్చించింది. ఇంతకీ ఇదెంత స్థలమనుకుంటున్నారు... సరిగ్గా పార్కింగ్ చేస్తే రెండు కార్లు పడతాయి ఇందులో. పదుల కోట్ల విలువ చేసే తన ఇంటిదగ్గరే ఈ పార్కింగ్ స్థలం ఉండడంతో ఇంత మొత్తం వెచ్చించానని ఆమె చెబుతోంది. కానీ, అదే పట్టణంలో కోటి రూపాయలు పెడితే ఓ కుటుంబం మొత్తం హాయిగా ఉండేందుకు సరిపడే ఇల్లు లభిస్తుందట. అయినా ఆమే ఆ మొత్తం వెచ్చించింది.

  • Loading...

More Telugu News