: తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రభావం


కేసీఆర్ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. గద్వాల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అచ్చంపేట డిపో వద్ద టీఆర్ఎస్ నేతలు బైఠాయించి బస్సులు బయటకు రానీయడం లేదు. మెదక్ జిల్లా సిద్దిపేటలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సంగారెడ్డిలో బస్సులు అడ్డుకునేందుకు వెళ్లిన టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డకుని అరెస్టు చేశారు.

హైదరాబాదులో బస్సులు యధాతథంగా నడుపుతున్నారు. పోలీసుల్ని బస్సులకు కాపలాగా ఉంచి మరీ నడుపుతున్నారు. కుషాయిగూడ, ఉప్పల్, హయత్ నగర్ ఆర్టీసీ డిపోలనుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వీర్ని అరెస్టుచేసి బస్సులను నడుపుతున్నారు. మరో వైపు వరంగల్ జిల్లా హన్మకొండలో బస్సులను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో బంద్ కొనసోగుతోంది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. బస్సుల రాకపోకలు అడ్డుకున్నందుకు జీవన్ రెడ్డిని అరెస్టు చేసినా బంద్ జరుగుతోంది. దీంతో రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి.

  • Loading...

More Telugu News