: సీఎంకు చుక్కలు చూపించామంటున్న టీజేఏసీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా అధికార కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టించామని తెలంగాణ జేఏసి అంటోంది. ఛలో అసెంబ్లీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా ఎక్కడిక్కడ ఆందోళనలు చేయడం ద్వారా తలపెట్టిన కార్యక్రమం సఫలమైందని నేతలు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ నినాదాలతో గోల్కొండ పోలీస్ స్టేషన్ దద్దరిల్లింది. పోలీస్ స్టేషన్లోనే మాక్ అసెంబ్లీని నిర్వహించి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఛలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు గోల్కొండ పోలీస్స్టేషన్లో ఉంచారు. మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.