: మొయిలీ చెప్పేది నమ్మొద్దు: సీపీఐ నేత గురుదాస్
చమురు దిగుమతి లాబీలు బెదిరిస్తున్నాయంటూ వీరప్ప మొయిలీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలంటున్నారు సీపీఐ నేత గురుదాస్ గుప్తా. కేంద్ర చమురు, సహజవాయు శాఖ మంత్రి మొయిలీ తనను చమురు దిగుమతి లాబీలు బెదిరింపులకు గురిచేస్తున్నాయంటూ ఇంతక్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పందించిన గురుదాస్.. మొయిలీ మాటలు నమ్మవద్దని, అవన్నీ కట్టుకథలే అని కొట్టిపారేశారు. తనను తాను కాపాడుకునేందుకే మొయిలీ అలా చెబుతున్నారని గురుదాస్ అన్నారు.