: ఇన్ఫోసిస్, విప్రో ఉద్యోగుల జీతాల పెంపు


ఇన్ఫోసిస్‌ 8 శాతం, విప్రో 6 నుంచి 8 శాతం వరకు తమ ఉద్యోగస్తులకు వేతనాలు పెంచుతున్నాయి. దేశ ఐటీ రంగంలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ రెండు సంస్థలు రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. నారాయణమూర్తి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మరోసారి వచ్చిన వెంటనే ఈ మార్పు రావడంతో ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. విదేశాల్లో ఉన్న ఉద్యోగుల వేతనాలను 3 శాతం పెంచుతామని ఇన్ఫోసిస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌ రెండేళ్ల కిందట ఇన్ఫోసిస్‌, విప్రో కంటే వెనుక ఉండేది. ఇప్పుడు రెండు కంపెనీలను అధిగమించి రెండో స్థానంలోకి వచ్చింది. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో ఐటీ కంపెనీలు జీతాలు పెంచుతాయి. కానీ ఈ కంపెనీలు ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమయింది.

  • Loading...

More Telugu News