: అర్ధాంతరంగా ముగిసిన రాహుల్ దూత పర్యటన
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ దూత, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జీ ముధుసూదన్ మిస్త్రీ పర్యటన అర్ధాంతరంగా ముగించారు. ఛలో అసెంబ్లీపై పలువురు కాంగ్రెస్ నేతలు మిస్త్రీని సంప్రదించనున్నందున ముందస్తుగా హస్తినకు బయల్దేరారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, జిల్లా సమీక్షలు నిర్వహించాల్సి ఉన్నా వాటిని వాయిదా వేసి, సీఎం, పీసీసీ ఛీఫ్ లను ఢిల్లీలో కలవాలని ఆదేశించి తిరుగు ప్రయాణమయ్యారు.