: భాష్పవాయుగోళం తగిలి విద్యార్థికి గాయం


ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య నెలకొన్న ఉద్రిక్తపూరిత వాతావరణం మరింత వేడెక్కింది. ర్యాలీగా బయల్దేరిన తమను పోలీసులు అడ్డుకోవడం విద్యార్థి వర్గాలకు కోపం తెప్పించింది. దీంతో, వారు బారికేడ్లను, ముళ్ళకంచెలను ధ్వంసం చేసైనా ముందుకెళ్ళేందుకు తీవ్రంగా యత్నించారు. ఈ క్రమంలో విద్యార్ధులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ క్రమంలో, ఓ గోళం కృష్ణా నాయక్ అనే విద్యార్థిని తాకడంతో అతను గాయపడ్డాడు. వెంటనే అతడిని యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఓయూలో ఎంఏ చదువుతున్న కృష్ణా నాయక్ వరంగల్ జిల్లా చౌకుల తండా వాసి.

  • Loading...

More Telugu News