: 'బంద్'కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ
చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా తమను అక్రమంగా నిర్బంధించడంపై ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేపు బంద్ కు పిలుపునిస్తున్నట్టు ఓయూ విద్యార్థి జేఏసీ ఈ మధ్యాహ్నం ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను భేషరతుగా విడుదల చేయాలని విద్యార్థి జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.