: సీఎంకు టీఆర్ఎస్ నేత శాపనార్థాలు
తెలంగాణవాదాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారు టీఆర్ఎస్ నేత శ్రవణ్. కిరణ్ కు పోగాలం దాపురించిందని, అందుకే ఆయన చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతివ్వకుండా నిరాకరించారని ఆయన అన్నారు. పోలీసుల అండతో ఉద్యమాన్ని కాలరాయాలని సీఎం ప్రయత్నించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన క్రమంలో ఆయన మాట్లాడుతూ, సర్కారుకు పోయేకాలం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇందిరాపార్క్ వద్ద శ్రవణ్ ను పోలీసులు ఈ మధ్యాహ్నం అదుపులోకి తీసుకుబోగా.. ఆయన కిందపడి సృహ కోల్పోయారు.