: మోడీ వివాదంతో జేడీయూలో స్పర్థలు
నరేంద్ర మోడీ వివాదం జేడీయూపై గట్టి ప్రభావం చూపుతోంది. బీహార్లో శనివారం జరిగే ర్యాలీలో నితీష్ కుమార్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఎన్డీయేతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు లేవని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ చెబుతోంటే, మరోవైపు నితీష్ కుమార్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. కాగా ఎన్డీయేలో కొనసాగడంపై జేడీయూలో సస్పెన్స్ కొనసాగుతోంది.