: కొనసాగుతోన్న అరెస్టుల పర్వం
చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శాసనసభ గేట్-2 వద్ద రోడ్డుపై పడుకుని రాస్తారోకో చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటు సీపీఐ శాసనసభ్యుడు కూనం సాంబశివరావు, బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణలను అదుపులోకి తీసుకున్నారు. ఇక, చలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతుగా అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణను అదుపులోకి తీసుకునే సమయంలో లిబర్టీ వద్ద సీపీఐ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట కూడా చోటు చేసుకుంది.