: శాసనసభ.. షరామామూలే
రాష్ట్ర అసెంబ్లీ ఏకంగా సోమవారానికి వాయిదాపడింది. విపక్షాలు తమ ఆందోళనను తీవ్రతరం చేయడంతో స్పీకర్ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ ఉదయం ప్రారంభమైన సభ రెండు సార్లు అరగంట పాటు వాయిదాపడింది. అనంతరం పునఃప్రారంభమైనా.. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్ళి అక్కడ ఆందోళన చేయడంతో స్పీకర్ పలుమార్లు హెచ్చరించారు. అయినా, ప్రతిపక్ష సభ్యులు ఖాతరు చేయకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.