: దొంగచాటుగా వచ్చావులే..: సీఎంకు హరీశ్ చురక
చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతించకుండా, తెలంగాణ వాదులకు భయపడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దొంగచాటుగా శాసనసభకు వచ్చారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ అసమర్థ ప్రభుత్వం హైదరాబాద్ ను పోలీసు వలయంలో ఉంచి నగర ప్రతిష్ఠను మంటగలుపుతోందని విమర్శించారు. సర్కారు అణచివేత వైఖరి అవలంబిస్తుండడంతో ఉద్యమకారులు ఎక్కడివారక్కడే నిరసనలు తెలుపుతూ రాస్తారోకోలు నిర్వహించి, జైల్ భరోలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.