: చెలరేగిన బొపారా ... ఇంగ్లాండ్ 293/7


అద్భుతంగా ఆడిన ఇంగ్లాండ్ శ్రీలంకకు భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. గెలిచి నిలవాల్సిన మ్యాచ్ లో చూడచక్కని ఆటతీరుతో ఇంగ్లాండ్ ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. బెల్(20) తొందరగా ఔటైనా కుక్(59), ట్రాట్(76) ఇంగ్లాండ్ ను నిలబెట్టారు. కుక్ అనంతరం వచ్చి రూట్(76) ట్రాట్ కు అండగా నిలబడి పోరాడగలిగే స్కోరును సాధించారు. చివర్లో రవి బొపారా(13 బంతుల్లో 33) విరుచుకుపడడంతో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 297 పరుగులు సాధించింది. మలింగ, ఎరంగ, హెరాత్ రెండేసి వికెట్లు తీసుకుని రాణించారు. అనంతరం 294 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక నాలుగు ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 14 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News