: క్వార్టర్స్ కు దూసుకెళ్ళిన సైనా
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్ళింది. ఇటీవలే థాయ్ లాండ్ ఓపెన్ లో నిరాశాజనకమైన ఆటతీరు కనబర్చిన సైనా.. ఈ టోర్నీలో గట్టి పట్టుదల కనబరుస్తోంది. నేడు జరిగిన ప్రీక్వార్టర్స్ లో ఈ హైదరాబాదీ తార 21-13, 21-19తో జపాన్ అమ్మాయి సయాకా తకహషిని వరుస గేముల్లో చిత్తు చేసింది. సైనా.. థాయ్ ఓపెన్ లో తన పోరాటాన్ని క్వార్టర్స్ తో ముగించిన సంగతి తెలిసిందే.