: ప్రేమిస్తే ప్రేమిస్తా: సన్నిలియోన్
తనను ప్రేమించిన వారికే తన ప్రేమ అందుతుందంటోంది బాలీవుడ్ తార సన్నిలియోన్. నీలిచిత్రాల నాయికగా ప్రస్థానం ప్రారంభించిన ఈ అందగత్తె, ఇప్పుడిప్పుడే బాలీవుడ్ స్టార్ గా పేరుతెచ్చుకుంటోంది. 'భారతదేశంలో నన్ను నన్నుగా అభిమానించేవారు పెరుగుతున్నారు. చాలామంది స్టార్లు స్నేహితులయ్యారు. అందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. దానికి నా వైఖరే కారణమనుకుంటాను. ప్రతి ఒక్కరితోనూ నేను సన్నిహితంగా ఉండలేను. అలాగే నన్ను ప్రేమగా చూసినవారిని వదులుకోలేను' అంటోంది సన్నీ.