: భారత్ నా ఆశలను వమ్ము చేసింది : 'వికిలీక్స్' అసాంజ్


భారత దేశంలో రక్షణ పొందాలనుకున్న తనను ఆ దేశం నిర్లక్ష్యం చేసిందంటున్నాడు వికిలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజ్. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసాంజ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. 'అమెరికా నుంచి నాకు ప్రమాదం ఉందని గమనించిన వెంటనే నేను ముందుగా భారతదేశంలో రక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే, భారతీయులు చేసినట్లుగా మరే దేశస్తులూ వికీలీక్స్ కు సపోర్ట్ చేయలేదు. మానవహక్కులను రక్షించడంలో ఆ దేశమే ముందుంటుంది. అందుకే అక్కడికే వెళ్లాలని అనుకున్నాను. కానీ, ఎందుకో నాకు రక్షణ కల్పించేందుకు భారత్ ఇష్టపడలేదు. చాలా లేఖలు రాశాను గానీ, భారత్ నుంచి స్పందన రాలేదు' అంటూ అసాంజ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News