: బంగారం కొనొద్దు : చిదంబరం
బంగారం కొనుగోలుకు వీలున్నంత దూరంగా ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం విజ్ఞప్తి చేశారు. బంగారంపై మదుపు, విక్రయాలపై తాము చేసిన విజ్ఞప్తిని దేశ ప్రజలు మన్నిస్తున్నారనీ, అందుకే బంగారం దిగుమతులు తగ్గుతాయని చెప్పారు. మన దేశంలో 30 గ్రాముల బంగారం కూడా ఉత్పత్తి కావడం లేదనీ, సాధ్యమైనంత వరకు ప్రజలు బంగారానికి దూరంగా ఉండాలని చిదంబరం గురువారం మరోసారి విజ్ఞప్తి చేశారు.