: 'పెద్ద' దిక్కు పోయాడు!
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన వ్యక్తిగా గుర్తింపు పొందిన జపాన్‌కు చెందిన జిరోమన్ కిమురా బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. కిమురా 1897 ఏప్రిల్ 19న క్యోటో రాష్ట్రంలో జన్మించారు. చిరకాలం జీవించిన కిమురా తాతగారు ప్రపంచంలోనే అత్యంత వయోవృద్ధుడిగా 2011 ఏప్రిల్‌లో గిన్నిస్ సంస్థ గుర్తించింది. ఈ తాతగారే ప్రపంచం మొత్తానికి ప్రస్తుతానికి ఉన్న పెద్దాయనగా ప్రకటించేసింది.
అయితే ఈ విషయంలో కిమురా కన్నా ముందున్నదంటూ లా మెరన్ అనే అవ్వగారికి చైనా అధికార వార్తాసంస్థ వెలుగులోకి తెచ్చింది. కిమురా కన్నా లా మెరన్ అవ్వ అధిక వయసున్న వ్యక్తిగా ఈ వార్తా సంస్థ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. అయినా కూడా చైనా పుట్టిన తేదీ ధృవీకరణ పద్ధతులపై ఉద్భవిస్తున్న ప్రశ్నల కారణంగా అంతర్జాతీయ సంస్థలు లా వాదనను పట్టించుకోలేదు. దీంతో కిమురా తాతగానే ప్రపంచంలో పెద్దాయనగా గుర్తింపు పొందారు. అయితే ఇటీవలే లా అవ్వగారు కూడా మరణించారు. చివరికి పెద్ద తాతగారు కూడా చనిపోయారు. ఆయన తన సొంత పట్టణంలోనే సాధారణ ఆరోగ్య సమస్యల కారణంగానే మరణించారట.