: బాలయ్యకు జీవితకాల సాఫల్య పురస్కారం


డెలావేర్‌ వ్యాలీ తెలుగు సంఘం వారి 40వ వార్షికోత్సవాల్లో భాగంగా సాహిత్యం, కళలు, సామాజిక సేవారంగాల్లో విశిష్ట సేవలను అందించిన పలువురిని సన్మానించనున్నారు. ఇందులో ప్రముఖ సినీ నటుడు, బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ అసుపత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు.

ఈనెల 28,29 తేదీల్లో అమెరికాలోని కింగ్‌ ఆఫ్‌ ప్రష్యా నగరంలో ఈ వేడుకలు జరగనున్నాయని సంఘ అధ్యక్షుడు పొట్లూరి రవి తెలిపారు. ఈ వేడుకల్లో బాలకృష్ణను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నారు. ఇంకా సన్మానగ్రహీతల్లో డాక్టర్‌ గుత్తికొండ రవీంధ్రనాధ్‌, చివుకుల ఉపేంద్ర, నరిశెట్టి రాజు, ఎన్‌.టి.చౌదరి తదితరులున్నారు.

  • Loading...

More Telugu News