: భారత్ మా మిత్రదేశం. భారత భద్రతా విఘాత చర్యలకు పాల్పడం: ఇజ్రాయెల్
గత ఐదేళ్లుగా పాకిస్థాన్ కు ఇజ్రాయెల్ సైనిక ఆయుధాలు సరఫరా చేస్తోందంటూ బ్రిటన్ కు చెందిన ఆయుధ అనుమతుల సంస్థ (బీఐఎస్) తాజా నివేదికలో పేర్కొంది. దీంతో ఇజ్రయేల్ తక్షణ ఉపశమన చర్యలకు, పరస్పర నమ్మక చర్యలకు పూనుకుంది. తాము పాకిస్థాన్ కు ఎలాంటి సైనిక సామగ్రి ఎగుమతి చేయడం లేదని స్పష్టం చేసింది. న్యూఢిల్లీ లోని ఇజ్రాయెల్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 'పాకిస్థాన్ కు మేము సైనిక సామగ్రి విక్రయించామన్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇజ్రాయెల్ కు భారత్ తో దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. భారత భద్రతకు ముప్పుగా పరిణమించే ఏ చర్యలకూ పాల్పడం' అని స్పష్టంగా తెలిపింది. అలాగే ఈ నివేదికపై బీఐఎస్ నుంచి వివరణ కోరినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.