: నిజాయతీ, నిబద్ధత ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలి: జేపీ
నీతి, నిజాయతీ, నిబద్ధత ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ కోరారు. చాలాకాలం తరువాత హైదరాబాదులో మీడియా ముందుకొచ్చిన జేపీ మాట్లాడుతూ, ప్రజల జీవన స్థితిగతుల గురించి పట్టించుకోవడమే నిజమైన రాజకీయమని అన్నారు. సంక్షోభంలో కూరుకున్న రాజకీయాలను బయటకు తీసుకురావాలంటే ప్రజలు బయటకు రావాలన్నారు. తమ పార్టీ అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను సమన్వయం చేయడం కోసం కృషి చేస్తోందన్నారు.