: చిన్నారిని కారు నుంచి విసిరేసిన తండ్రి


నడుస్తున్న కారు నుంచి ఏడేళ్ల కుమార్తెను ఓ కర్కశ తండ్రి విసిరేసిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మంలోని ద్వంసలపురం సమీపంలో రోడ్డు పక్క తీవ్రగాయాలతో పడి ఉన్న అమోఘ అనే ఆ చిన్నారిని దారిన పోయేవాళ్లు గుర్తించి 108కి ఫోన్ చేసి ఆస్పత్రిలో చేర్చారు. తలపై తీవ్రగాయంతో ఉన్న అమోఘ కాస్త కోలుకొని జరిగిన విషయాన్ని వివరించింది.

అమోఘ చెప్పిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని గుట్టల బజార్ కు చెందిన కమిషన్ ఏజెంట్ దేవేందర్, భార్య కల్పన, కుమార్తె అమోఘతో కలసి హైదరాబాదులో ఓ పెళ్లికి కారులో వెళ్లారు. తిరిగివస్తున్న సమయంలో భార్యాభర్తలకు ఏదో విషయంపై వాగ్వాదం చెలరేగింది. ఆ క్రమంలో తీవ్ర ఆగ్రహంతో పక్కనే ఉన్న కుమార్తె అమోఘను కొట్టి, కారు నుంచి దేవేందర్ విసిరేశాడని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News