: మందగించిన పారిశ్రామికోత్పత్తి.. తగ్గిన ద్రవ్యోల్బణం
ఏప్రిల్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి కాస్త మందగించింది. మార్చిలో పారిశ్రామికోత్పత్తిని సూచించే సూచీ ఐఐపీ 2.5శాతం నమోదుకాగా, ఏప్రిల్ నెలకొచ్చేసరికి అది 2 శాతానికి పడిపోయింది. ఇక మే నెలకు సంబంధించి వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 9.39 నుంచి 9.31కి తగ్గింది. 8.9కి తగ్గుతుందని అంచనా వేసినప్పటికీ దానికి భిన్నంగా చాలా స్వల్పంగానే తగ్గింది.