: కాలగర్భంలో సత్యం కంప్యూటర్స్


టెక్ మహీంద్రాతో సత్యం కంప్యూటర్స్ విలీనానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం అనుమతించింది. విలీనానికి వ్యతిరేకంగా సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగ రాజు కుటుంబం వేసిన దానితోపాటు 35 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు సత్యంలో మైనారిటీ వాటా ఉంది. ఈ కంపెనీ కూడా విలీనాన్ని వ్యతిరేకించింది. వీటన్నింటినీ జస్టిస్ ఎన్ఆర్ఎల్ నాగేశ్వరరావు కొట్టివేశారు. ఈ కుంభకోణంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు మాత్రం యధావిధిగా కొనసాగుతుందని చెప్పారు. సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్‌ను టెక్ మహీంద్రా ఏప్రిల్ 2009లో ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో వేలంపాటలో కొనుగోలు చేసింది. ఈ రెండు కంపెనీలు విలీనం అయితే 2.4 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదుగుతుంది. సత్యం అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కోర్టు తీర్పును గౌరవిస్తామని, విలీన ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తామన్నారు.

  • Loading...

More Telugu News