: అహంకార సీఎం: టీఆర్ఎస్
రైతుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళ చేస్తుంటే గౌరవించాల్సినది పోయి, నాటకాలాడొద్దంటూ కిరణ్ కుమార్ రెడ్డి అవమానపరిచారని టీఆర్ఎస్ ఆక్షేపించింది. ముఖ్యమంత్రి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ అసెంబ్లీ మీడియా పాయింట్ లో అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సీఎంను చూడలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు ధర్నా చేసే హక్కు లేదా? అని ప్రశ్నించారు.