: నాటకాలొద్దంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్
14న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభలోని ముఖ్యమంత్రి చాంబర్ ముందు బైటాయించి నినాదాలు చేస్తున్నారు. ఇది చూసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహంతో "నాటకాలొద్దు చాంబర్ లోపలకు రండి మాట్లాడుకుందాం" అంటూ లోపలకు వెళ్లిపోయారు.