: ఎస్ఎంఎస్ కొట్టు... రైలు టికెట్ పట్టు
ఇకపై మీరు రైలు రిజర్వేషన్ కోసం స్టేషన్ ముందు క్యూ కట్టాల్సిన పనిలేదు. ఎంచక్కా చేతిలో మొబైల్ నుంచే ఎస్ఎంఎస్ కొట్టి టికెట్ పట్టేయవచ్చు. రైల్వే మంత్రిత్వశాఖ ఈ సదుపాయాన్ని జూలై నుంచి అమల్లోకి తేవాలని యోచిస్తోంది.
రైల్వే అధికారుల సమచారం ప్రకారం.. ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు ఐఆర్ సీటీసీ వద్ద మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. బ్యాంకులో కూడా నమోదు చేసుకుని మొబైల్ నంబర్ ఐడెంటిఫయర్ పాస్ వర్డ్ తీసుకుని ఉండాలి. ఎక్కాల్సిన స్టేషన్, దిగాల్సిన స్టేషన్, రైలు నంబర్, ప్రయాణ తేదీ, ఏ తరగతిలో ప్రయాణించాలనుకుంటున్నారు, పేరు, వయసు, స్త్రీ, పురుష వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి. తర్వాత ట్రాన్సాక్షన్ ఐడితో ఎస్ఎంఎస్ వస్తుంది. దాని ఆధారంగా బ్యాంక్ మొబైల్ మనీ ఐడెంటిఫయర్ పాస్ వర్డ్ పంపాలి. దాంతో ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. అదే మీ రైలు టికెట్. మొబైల్లో భ్రదంగా ఉంటుంది.