: మహాధర్నాకు సిద్ధమవుతున్న తెలుగు తమ్ముళ్లు
కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల చేయాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తెలుగుదేశం పార్టీ మహాధర్నాకు సిద్దమవుతోంది. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కూచిపూడి లాకుల వద్ద పార్టీ నాయకుడు చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులన్నీ పాల్గొనాలని టీడీపీ పిలుపునిచ్చింది. కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ వ్యూహాన్ని బాబు రేపు ఖరారు చేయనున్నారు.