: పాక్ ప్రధాని సంస్కరణలు


పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధానిగా అడుగుపెడుతూనే సంస్కరణలను అమలు చేస్తున్నారు. దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపేందుకు తన కార్యాలయాన్నే వేదిక చేసుకున్నారు. పరిపాలనలో విలక్షణత చాటేందుకు రంగం సిద్దంచేసిన షరీఫ్, తన కార్యాలయ సిబ్బందిని మూడో వంతు తగ్గించాలని, ఇస్లామాబాద్ లోని అధికార నివాసానికి వెళ్లే రహదారి సుందరీకరణ పనులను తక్షణం రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. పాక్ ప్రధానిగా మూడోసారి పదవిని చేపట్టిన షరీఫ్ ప్రజాధనాన్ని న్యాయబద్దంగా ఖర్చు చేయాలని, వృధా వ్యయాన్ని నియంత్రించి దాంతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి గట్టి ఆదేశాలిచ్చారు.

  • Loading...

More Telugu News