: అద్వానీ నిర్ణయంపై మోడీ హర్షం
గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ .. అద్వానీ రాజీనామా ఉపసంహరణపై స్పందించారు. అగ్రనేత నిర్ణయం పట్ల తన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. రాజీనామా వెనక్కితీసుకోవాలన్న అద్వానీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీలోని లక్షలాది కార్యకర్తలు అద్వానీ తాజా నిర్ణయంతో సంతోషభరితులవుతారని మోడీ ట్వీట్ చేశాడు.