: అద్వానీ రాజీనామా ఉపసంహరిస్తానన్నారు: రాజ్ నాథ్ సింగ్
అద్వానీ రాజీనామా ఉపసంహరించుకుంటానని మాటిచ్చారని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. సుధీర్ఘ చర్చల అనంతరం అద్వానీ తన రాజీనామా ఉపసంహరణకు అంగీకరించారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. అద్వానీ సూచించిన అంశాలమీద చర్చించామని, పార్లమెంటరీ బోర్డు చేసిన విజ్ఞప్తిని అద్వానీ ఆమోదిస్తానన్నారని బీజేపీ అధ్యక్షుడు తెలిపారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అద్వానీతో మాట్లాడారని ఆయన అన్నారు. పార్టీకి అద్వానీ మార్గదర్శనం తమకు అవసరమని రాజ్ నాథ్ తెలిపారు.