: ఫేస్ బుక్.. ఫేస్ ఇట్


ఫేస్ బుక్ లో అకౌంట్ కొనసాగించుకోవాలనుకునే జంటలు ఈసారి ఇలా అనుకోవాలేమో. ఎందుకంటే, ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్న జంటల్లో బంధాలు బద్దలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటోందని ఓ సర్వే చెబుతోంది. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరికి చెందిన విద్యార్థి రస్సెల్ క్లేటన్, హవాయి యూనివర్సిటీ ఇనస్ట్రక్టర్ అలెగ్జాండర్ నాగర్నె, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన సెయింట్ మేరీ యూనివర్సిటీకి చెందిన జెస్సికా ఆర్.స్మిత్ సంయుక్తంగా ఫేస్ బుక్ పై పరిశోధన జరిపారు. 18 - 82 సంవత్సరాల వయసున్న ఫేస్ బుక్ యూజర్లపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. ఫేస్ బుక్ ను అధికంగా ఉపయోగించడం వల్ల జంటల్లో అనురాగం తగ్గుతోందని ఈ సర్వేలో తేలినట్టు ఈ సర్వే సభ్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News