: దాసరి సంస్థల్లో జిందాల్ పెట్టుబడులు


కేంద్ర గనుల శాఖ మాజీ మంత్రి, 'దర్శకరత్న' దాసరి నారాయణరావు మెడకు బొగ్గు కుంభకోణం చుట్టుకుంటోంది. బొగ్గు నిల్వలను తమ సంస్థలకు కేటాయించినందుకు ప్రతిగా జిందాల్.. దాసరి సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు సీబీఐ ఆరోపించింది. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేసింది. 120 (బి), రెడ్ విత్ 420 సెక్షన్ల కింద దాసరితో పాటు జిందాల్ మరో 5 కంపెనీలపై కేసు నమోదు చేశారు. బొగ్గు గనుల కోసం జిందాల్ తప్పుడు సమాచారం సమర్పించిందని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.

కాగా, కోల్ స్కాంలో దాసరి పేరును తాజా ఎఫ్ఐఆర్ లో చేర్చిన సీబీఐ ఈ ఉదయం నుంచి ఆయన నివాసంలో సాగిస్తున్న సోదాలను ముగించింది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను సీబీఐ అధికారులు దాసరి నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అంతేగాకుండా, అధికారులు దాసరికి చెందిన 'సౌభాగ్య మీడియా' కార్యాలయంలోనూ సోదాలు జరిపారు. దాసరి పేరును ఎఫ్ఐఆర్ లో పేర్కొనడంతో ఆయన అరెస్టుకు అవకాశాలున్నాయని తొలుత భావించినా, అలాంటిదేమీ జరగలేదు.

  • Loading...

More Telugu News