: బొగ్గు కుంభకోణానికి ప్రధానే బాధ్యత వహించాలి: బీజేపీ డిమాండ్


బొగ్గు కుంభకోణానికి ప్రధాని మన్మోహన్ సింగే బాధ్యత వహించాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 147 సంస్థలకు అక్రమంగా బొగ్గు నిల్వలను ఆయాచితంగా కేటాయించారని ఆరోపించారు. ఈ కుంభకోణం నిందితులను ప్రభుత్వం వెనకేసుకొస్తోందని ఆయన అన్నారు. వారిని ప్రశ్నించేందుకు అనుమతించడం లేదని జవదేకర్ పేర్కొన్నారు. ఇక, దాసరి, జిందాల్ నివాసాల్లో సీబీఐ సోదాలను స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News