A R Rahman: వారిని కూడా నా కుటుంబస‌భ్యులుగానే భావిస్తా: ఏఆర్ రెహ‌మాన్

A R Rahmans Response to Divorce Trolling

  • గ‌తేడాది త‌మ 29 ఏళ్ల వివాహ‌బంధానికి స్వ‌స్తి ప‌లికిన రెహ‌మాన్ దంప‌తులు
  • ఈ విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత వ‌చ్చిన ట్రోలింగ్స్ పై తాజాగా స్పందించిన సంగీత ద‌ర్శ‌కుడు
  • త‌న‌ను విమ‌ర్శించే వారిని కూడా త‌న కుటుంబ‌స‌భ్యులుగానే భావిస్తాన‌న్న రెహ‌మాన్

ఆస్కార్ అవార్డు విజేత‌, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ దంప‌తులు గ‌తేడాది త‌మ 29 ఏళ్ల వివాహ‌బంధానికి స్వ‌స్తి ప‌లికిన విషయం తెలిసిందే. అయితే, ఈ విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత వ‌చ్చిన ట్రోలింగ్స్ పై రెహ‌మాన్ తాజాగా స్పందించారు.  

"సెల‌బ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. వారి జీవితాల్లో ఏం జ‌రుగుతుందో ప‌రిశీలిస్తుంటారు. ఇక విమ‌ర్శ‌లు స‌ర్వ‌సాధారాణం. వాటి నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేరు. నేను కూడా అంతే. నా గురించి త‌ప్పుగా మాట్లాడేవారిని కూడా నా కుటుంబ స‌భ్యులే అనుకుంటాను. నేను ఒక‌రి గురించి త‌ప్పుగా మాట్లాడితే... నా గురించి మ‌రొక‌రు మాట్లాడుతారు. నా ఫ్యామిలీని ఎవ‌రైనా విమ‌ర్శిస్తే... నేను బాధ‌ప‌డ‌తాను. అలాగే ఇత‌రుల‌కు కూడా కుటుంబాలు ఉంటాయి క‌దా... అందుకే నేను ఎప్పుడూ ఎవ‌రి గురించి త‌ప్పుగా మాట్లాడ‌ను. వారంద‌రినీ స‌రైన మార్గంలో న‌డిపించ‌మ‌ని దేవుడిని ప్రార్థిస్తాను" అని రెహ‌మాన్ చెప్పుకొచ్చారు. 

ఇక‌, రెహ‌మాన్, సైరా బాను 1995లో పెళ్లి బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఈ దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు. గ‌తేడాది వారి 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి ప‌లుకుతున్న‌ట్లు ప్ర‌క‌టించి అందరికీ షాకిచ్చిన విష‌యం తెలిసిందే.  

A R Rahman
A R Rahman divorce
A R Rahman family
Sairah Banu
celebrity divorce
Indian musician
Oscar award winner
trolling
celebrity life
music composer
  • Loading...

More Telugu News