AP Tourism Bus: ఏపీ టూరిజం బస్సులో బాలికకు వేధింపులు?.. డ్రైవర్లపై చర్యలకు ఆదేశం!

Minor Girl Harassed on AP Tourism Bus Investigation Underway
  • ఏపీ టూరిజం బస్సులో మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణ
  • తిరుపతి నుంచి కోయంబత్తూర్ వెళ్తుండగా ఈ నెల 14న ఘటన
  • అనధికార ప్రయాణికులు, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై తండ్రి ఆరోపణ
  • తమిళనాడు, ఏపీ సీఎంలకు, టూరిజం అధికారులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు 
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన బస్సులో ఓ మైనర్ బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 14న తిరుపతి నుంచి కోయంబత్తూర్ వెళ్తున్న ఏపీ టూరిజం బస్సులో ఈ ఘటన జరిగినట్లు బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తన కుమార్తె ప్రయాణిస్తున్న బస్సులోకి సిబ్బంది అనధికారికంగా ప్రయాణికులను ఎక్కించుకున్నారని, బస్సులోని సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈ అమానుష ఘటనపై, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ టూరిజం శాఖ ఉన్నతాధికారులకు ఆయన ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు.

ఈ ఫిర్యాదుపై ఏపీ పర్యాటక శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. ఘటనపై విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణ అనంతరం బస్సు డ్రైవర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
AP Tourism Bus
Minor Girl Harassment
Tirupati to Coimbatore
Andhra Pradesh Tourism
Sexual Harassment
Bus Drivers
Disciplinary Action
CC Cameras
Tamil Nadu CM
Andhra Pradesh CM

More Telugu News