Koneru Hampi: కోనేరు హంపి ఖాతాలో ఫిడే టైటిల్

Koneru Hampi Wins FIDE Womens Grand Prix Title

  • అత్యుత్తమ టై బ్రేక్ ఆధారంగా టోర్నీ విజేతగా నిలిచిన కోనేరు హంపి
  • పుణె వేదికగా ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ఫి చెస్ టోర్నమెంట్

తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి చెస్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచారు. పూణే వేదికగా నిర్వహించిన ఈ చెస్ టోర్నమెంట్‌లో తుది పోరు సమయానికి చైనా క్రీడాకారిణి జు జినర్‌తో కలిసి హంపి అగ్రస్థానంలో కొనసాగారు.

ఫైనల్ రౌండ్‌లో కోనేరు హంపి బల్గేరియాకు చెందిన సుర్గుయిల్ సలిమావాపై 1-0 తేడాతో గెలుపొందారు. మరోపక్క జు జినర్ కూడా రష్యాకు చెందిన పొలినా షువలోవాపై విజయం సాధించడంతో వీరిద్దరూ మొదటి స్థానంతో ముగించారు. అయితే, ఉత్తమ టై-బ్రేక్ ఆధారంగా హంపి టైటిల్ విజేతగా నిలిచారు.

మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక మంగోలియా క్రీడాకారిణి ముంగంతూర్ బత్ఖుయాగ్‌తో, వైశాలి జార్జియా క్రీడాకారిణి సలోమ్ మెలియాతో, దివ్య దేశ్‌ముఖ్ రష్యాకు చెందిన ఎలీనా కాష్లిన్‌స్కాయాతో తమ గేమ్‌లను డ్రాగా ముగించారు. 

Koneru Hampi
FIDE Women's Grand Prix
Chess Tournament
Pune
Indian Chess Player
Ju Wenjun
Surguyl Salimava
Dronavalli Harika
  • Loading...

More Telugu News